TG: వనపర్తి జిల్లా పెబ్బేరు పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సబ్‌స్టేషన్‌లో లాగ్‌బుక్‌లు పరిశీలించి పెబ్బేరులో సబ్‌స్టేషన్ నుంచి సుభాష్ చౌరస్తా వరకు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు 6 గంటలకు మించి కరెంటు ఇవ్వడంలేదని ఫైర్ అయ్యారు. జూరాల ఆయకట్టు ఆగమైపోతోందని మండిపడ్డారు.