తమ గోడు పట్టించుకోకపోవడంతో పలువురు వృద్ధ రైతులు కలెక్టరేట్ ప్రాంగణంలో పొర్లుదండాలు పెట్టారు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. నకిలీ పత్రాల ద్వారా కొంత మంది భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ మందసౌర్‌కు చెందిన కొందరు రైతులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవంతో వారంతా కలెక్టరేట్ ప్రాగణంలోనే పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు.