TG: వారం రోజులైనా రైతులకు యూరియా దొరకని పరిస్థితి నెలకొంది. సోమవారం మహబూబాాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పోగుళ్లపల్లి రైతు కేంద్రంలో యూరియా కోసం అన్నదాతలు మండుటెండలో పడిగాపులు కాస్తున్నారు. అక్కడ రైతులు వేచి ఉండేందుకు ఎటువంటి నీడ సదుపాయం లేకపోవడంతో తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులను క్యూలో పెట్టి, యూరియా కోసం వేచి చూస్తున్నారు. అర్ధరాత్రి 2గంటలకు లేచి 40 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.