TG: సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటిస్తున్నారు. గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల త్వరాత రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. 'రైతు రుణమాఫీ కింద 25.35 లక్షల మందికి రూ.21 వేల కోట్లు ఖర్చు చేశాం. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు రూ.500 బోనస్ ఇస్తున్నాం. రైతు భరోసా కింద రూ.6వేల చొప్పున రూ.9వేల కోట్లు ఇచ్చాం' అని చెప్పారు.