ఇథనాల్ వాడకం రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా, పెట్రోలియం దిగుమతులపై దేశ ఆధారపడటాన్ని తగ్గిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం, ప్రజా రవాణా ప్రోత్సాహంపై ఆయన పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులు కేవలం అన్నదాతలే కాకుండా, ఇప్పుడు ‘ఇంధన దాతలు’గానూ మారారని ఆయన అభివర్ణించారు.