వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. హైవేలపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రవేశపెడుతున్నట్లు బుధవారం ప్రకటించింది. రూ.3000 చెల్లించి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకుంటే దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందన్నారు. ఆగస్టు 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.