ఉపవాసం: దైవానికి దగ్గరవ్వడమే అసలు అర్థం

ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదని, భగవంతునికి దగ్గరగా ఉండటమే అసలు ఉద్దేశ్యం. ఉపవాస సమయంలో తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారి ఏకాగ్రత పెరుగుతుంది. సాత్విక ఆహారం మనశ్శాంతిని పెంచుతుంది, రజసిక, తామసిక ఆహారాలు చంచలత్వాన్ని, ఉద్రేకాన్ని పెంచుతాయి. అందుకే ఉపవాసంలో వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి నివారించాలని సంప్రదాయాలు సూచిస్తాయి. నిజమైన ఉపవాసం అంటే కోపం, అసూయ, ద్వేషాన్ని అదుపులో ఉంచుకొని, దైవంపై విశ్వాసం పెంచుకోవడం.

సంబంధిత పోస్ట్