ఘోర ప్రమాదం.. ఐదుగురు కార్మికులు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోర్‌వెల్ లారీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఇతర కార్మికులు.. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్