TG: తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు ఆరుగురు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు. గాదిగూడ(M) పిప్పిరిలో 14 మంది రైతులు వ్యవసాయం చేస్తుండగా భారీ వర్షం కురవడంతో గుడిసెలోకి వెళ్లారు. అదే క్రమంలో గుడిసెపై పిడుగు పడటంతో మాదర్రావు(45), సంజన(22), మంగం భీంబాయి(40), సిడాం రాంబాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. అటు జిల్లాలోని బేల మండలంలో వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాట్లకు ఇద్దరు మహిళలు నందిని (30), సునీత(35) అక్కడికక్కడే మృతి చెందారు.

సంబంధిత పోస్ట్