ఏపీలో ఘోర ప్రమాదం.. మృతులు వీరే (వీడియో)

AP: మార్కాపురం జిల్లా గిద్దలూరులో ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. నల్లబండకు చెందిన 14 మంది బంధువులు కంభంలో పెళ్లికి ఆటోలో బయలుదేరారు. రోడ్డుపక్కన ఆలయంలో పూజ కోసం ఆటోను నిలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంకాలు (22), నగేశ్‌ (18), అలకనంద (18) అనే ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. చిన్నారి నాగలక్ష్మి( 4) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

సంబంధిత పోస్ట్