ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

AP: తూర్పు గోదావరి జిల్లా, కోరుకొండ (M) నరసాపురంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బైక్​పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రిలోని జీజీహెచ్​కు తరలించారు.

సంబంధిత పోస్ట్