AP: చిత్తూరు జిల్లా పలమనేరు హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం రాజాజీనగర్‌కు చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తుండగా.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు.