AP: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతులు వరంగల్‌కు చెందిన శ్రీధర్ రావు, భార్య లక్ష్మి, కుమార్తె ఆద్విక రావు (4)గా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుపతి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జేసీబీ సహాయంతో కారును పోలీసులు బయటకు తీస్తున్నారు.