నెదర్లాండ్స్‌లో ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు (వీడియో)

నెదర్లాండ్స్‌లో అక్టోబర్ 30న ఘోర ప్రమాదం జరిగింది. పళ్ల లోడుతో వెళ్తున్న భారీ ట్రక్కును వేగంగా వచ్చిన ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే క్రాసింగ్ వద్ద బారియర్లు ఒక్కసారిగా కిందకు రావడంతో ట్రక్కు అందులో చిక్కుకుపోయింది. రైలు పట్టాల మధ్య ఉండగా దూసుకొచ్చిన ట్రైన్ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ట్రక్కు పూర్తిగా ధ్వంసం అయింది. ట్రక్కులోని ఐదుగురికి గాయాలయినట్లు సమాచారం. రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

సంబంధిత పోస్ట్