అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడిగా పేర్కొంది. మృతుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్, కెనడియన్‌తో పాటు 12 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. 24 మంది మెడికోలతో కలిపి 265 మంది మరణించారని తెలిపింది.