లండన్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ బి200 అనే చిన్న ప్రయివేట్ విమానం సౌత్అండ్ ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. వెంటనే విమానంలో భారీ మంటలు చెలరేగి, ఒక్కసారిగా ఘోర శబ్దంతో పేలిపోయింది. ఈ విమానం లండన్ నుంచి నెదర్లాండ్స్‌లోని లిలైస్టాడ్‌కు బయలుదేరినట్టుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.