VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్-ప్రయాగరాజ్ హైవేపై  బస్సును బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారు. మృతులంతా మహాకుంభమేళాకు వెళ్తున్న వారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్