మంటల్లో కాలి బూడిదైన కారు.. వ్యక్తి సజీవదహనం

TG: సూర్యాపేట మండలం పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఖమ్మం–హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి  సజీవదహనం అయ్యాడు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారులో ఒక వ్యక్తే ఉన్నాడా.. మరెవరైనా ఉన్నారా అనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్

✕
✕