గుజరాత్‌లోని మోడస లునావాడ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ టీచర్, అతని సోదరుడు కారుతో బైక్‌ను ఢీకొట్టి, బైకుతోపాటు ఒక వ్యక్తిని సుమారు 1.5 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక యువకుడు మరణించగా, మరొకరు చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితులు మనీష్ పటేల్, మెహుల్ పటేల్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.