ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు ఢీకొని ఐదుగురు మృతి

అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్టాఫోర్డ్ కౌంటీ సమీపంలోని I-95 హైవేపై ట్రాఫిక్ నిలిచి ఉన్న సమయంలో, వెనుక నుండి వేగంగా వచ్చిన బస్సు ఆరు వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు డ్రైవర్ ట్రాఫిక్ మందగించడాన్ని గమనించలేకపోవడం, వేగాన్ని అదుపు చేయలేకపోవడం ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్