ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

AP: విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వేగేటు వద్ద ఓ  బైకు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు యువకులు మృతిచెందగా, మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్