AP: పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ములకలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఈ బైకులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతులు సత్తెనపల్లికి చెందిన రాకేష్, జానీగా గుర్తించారు.