గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రైవేట్ బస్సు, ట్రక్కును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.