దక్షిణ ఇటలీలోని మతేరా నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. సోమవారం రోమ్‌లోని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. గత శనివారం స్కాన్జానో జోనికో ప్రాంతంలో 10 మంది ప్రయాణిస్తున్న కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జీత్ (33), సింగ్ హర్విందర్ (31), సింగ్ జస్కరన్ (20)గా గుర్తించారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.