ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురి మృతి

AP: కర్నూలు నగరంలోని కేశవ గ్రాండ్ హోటల్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తికి కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతులను లక్ష్మీ నారాయణ, రామిరెడ్డి, వడ్డె శ్రీనుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్