కల్వర్టును ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

TG: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామవాసులుగా గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్

✕
✕