యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్పాట్‌ను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించి మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్