AP: నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. మృతులను వరుణ్ (18), నందకిశోర్ (18)తోపాటు ఆటోడ్రైవర్ సురేంద్ర (40) లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిలో ఓ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.