ఇంట్లో ఉరివేసుకొని తండ్రి, కూతురి ఆత్మహత్య

AP: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకొని తండ్రి గొనుగుంట్ల పోతులూరయ్య (60), కూతురు రామాంజమ్మ (39) ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యలకు కారణంగా గ్రామస్తులు, బంధువులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్