TG: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రి మానయ్య(46), కుమారుడు వెంకటేశ్వరులు (22) మృతి చెందారు. బోరుబావిలో పైపులు ఇంటికి తరలిస్తుండగా తీగలు తగిలి విద్యుత్ షాక్ కొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రీకొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.