TG: మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తెలుగు అధ్యాపకుడు తన కుమార్తె ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసిన గదిలోనే ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం రక్త సంబంధీకులు పరీక్ష రాస్తున్నప్పుడు సంబంధిత సిబ్బంది ముందస్తుగా ప్రిన్సిపల్‌కు సమాచారం ఇచ్చి విధులకు దూరంగా ఉండాలి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు అధికారులు విచారణ చేపట్టారు. ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి సదరు అధ్యాపకుడిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి దస్రూనాయక్ తెలిపారు.