మద్యానికి బానిసైన కొడుకు.. కర్రతో కొట్టి చంపిన తండ్రి

AP: మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చాడు. ఈ ఘటన విశాఖలోని విశాలాక్షి నగర్‌లో చోటు చేసుకుంది. అరిలోవ పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 6న మద్యానికి డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పినా వినలేదు. వేధించడంతో కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టాడు. దాంతో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పాతిపెట్టగా.. మృతుని భార్య రాజీ ఫిర్యాదులో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్