ముగ్గురు పిల్లలను చంపి.. ఆత్మహత్య చేసుకున్న తండ్రి

కొత్త సంవత్సర వేడుకల సమయంలో నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వేములపాటి సురేంద్ర (34) అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్‌ (2)లకు విషం కలిపిన పాలు తాగించి చంపేశాడు. అనంతరం తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్