TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షా వలి (35) అనే వ్యక్తి తన 5, 3 ఏళ్ల ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం తాను కూడా చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తొర్రూర్ మార్కెట్ సమీపంలో చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.