సూరత్‌లోని అమ్రోలిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన కొడుకు చేసిన అప్పులకు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కొడుకు రవిఅనే వ్యక్తి అప్పులు చేసి పరారయ్యాడని, అప్పు ఇచ్చిన వారు తండ్రి ప్రాగ్జీభాయ్‌కు తరచు ఫోన్ చేసి వేధిస్తుండటంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడని పేర్కొన్నారు.