ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు చెందిన రమన్ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కొడుకు ముందే ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన వెలుగుచూసింది. "నేను చనిపోవడానికి నా భార్య, అత్తమామలే కారణం, నా కుటుంబానికి ఇందులో ఎలాంటి సంబంధం లేదు" అని ఏడుస్తూ కొడుకుతో మాట్లాడుతూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆపై చేతి నరక కోసుకుని, విషం తాగి ప్రాణాలు విడిచాడు. వీడియోలో తన మరణానికి భార్య, అత్త, మరదలు మరియు అత్తగారింటి వారే బాధ్యులని రమన్ పేర్కొన్నాడు.