బ్రెడ్‌, జామ్‌ తిని తండ్రి మృతి.. ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత

కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో బ్రెడ్‌, జామ్‌ తిన్న 60 ఏళ్ల వినోద్‌ కుమార్‌ మృతి చెందగా.. ఆయన ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి ముగ్గురూ బ్రెడ్‌, జామ్‌ తిన్న కొద్దిసేపటికే వాంతులు, అనారోగ్యంతో బాధపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వినోద్‌ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕