ఫేమస్ కావాలని.. కొడుకుతో లారీ డ్రైవింగ్ చేయించిన తండ్రి (వీడియో)

రీల్స్ పిచ్చితో కొందరు ఫేమస్ కావాలని తమతో పాటు, తమవారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. అటువంటి ఘటనే ఇటీవల చోటు చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ అనే ఓ తండ్రి తన కొడుకు ప్రాణాలను ప్రమాదంలో పెట్టారు. హైవేపై కొడుకుతో లారీ డ్రైవింగ్ చేయించి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి ట్రక్ నెంబరు(JK02DC8178)ను షేర్ చేసి, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్