ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ తండ్రి కన్నుమూత

ప్రముఖ తెలుగు సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి ఏలేటి సుబ్బారావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. తూ.గో. జిల్లా తుని మండలం రేఖవానిపాలెంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ‘ఐతే’ సినిమాతో చంద్రశేఖర్ దర్శకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక్కడున్నాడు, ప్రయాణం, అనుకోకుండా ఒకరోజు, మనమంతా, సాహసం వంటి సినిమాలు తీశారు.

సంబంధిత పోస్ట్