కన్న తండ్రి, తన పదేళ్ల కూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తల్లి కూలి పనులకు వెళ్లిన సమయంలో తండ్రి తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవాడని కౌన్సిలింగ్ సమయంలో బాలిక తెలిపింది. దీనిపై పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.