కూతురిపై పలుమార్లు అత్యాచారం.. కన్నతండ్రికి 20 ఏళ్ల జైలు శిక్ష

TG: రంగారెడ్డి జిల్లా కోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో సొంత కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. షాబాద్ మండలానికి చెందిన 37 ఏళ్ల కూలీ ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో రుజువైంది. పోలీసులు 2024 అక్టోబర్ 12న కేసు నమోదు చేసి, మౌఖిక, డాక్యుమెంటరీ, శాస్త్రీయ ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల పరిహారం బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్