TG: నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ గ్రామంలో 2023లో జరిగిన దారుణ హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని మంటల్లోకి నెట్టి చంపిన తండ్రి కడమంచి కాశీరాంకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో నిందితుడికి రూ.2 వేల జరిమానా విధించింది. భార్యపై అనుమానమే ఈ హత్యకు కారణమని కోర్టు నిర్ధారించింది. భార్యపై కోపంతో 9 ఏళ్ల చిన్నారి సారక్కను మంటల్లోకి నెట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందింది. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి కాశీరాంకు జీవిత ఖైదు విధించారు.