కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

కర్ణాటకలోని కుంజత్తూరులో ఆస్తి వివాదం కారణంగా ఓ తండ్రి తన 18 ఏళ్ల కుమార్తె జుమైలాను కత్తితో పొడిచి చంపాడు. సోమవారం సాయంత్రం ఆస్తి విషయంలో జరిగిన గొడవలో తండ్రి ఉమర్ తన కూతురిపై దాడి చేశాడు. ఈ దాడిలో జుమైలా బాబాయ్ షేకుంజి కూడా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులు వెళ్లి చూడగా, జుమైలా రక్తపు మడుగులో పడి ఉంది. ఆస్తి, బంగారం గొడవల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్