ఫ్యాటీ లివర్ ఉన్నవారికి గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఒబెసిటీ, డయాబెటిస్, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్ వంటి ఒకే రకమైన ప్రమాద కారకాలను కలిగి ఉంటాయని పేర్కొంటున్నారు. ఆల్కహాల్ వల్ల కాకుండా కాలేయంలో అసాధారణంగా కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని American Heart Association అధ్యయనంలో తేలింది.