TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టాయి. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకులో క్యూలు కడుతున్నారు. హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న బంకులో వాహనదారుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పెట్రోల్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులతో క్యాన్లతో క్యూ కడుతున్నారు. అయితే ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వదంతులు నమ్మవద్దని అధికారులు చెబుతున్నారు.