తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న భానుమతి (52) రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. సింగనల్లూర్ బస్టాండ్ సమీపంలో స్కూటర్‌పై వెళ్తున్న ఆమెను శుక్రవారం బియ్యం సంచులను తీసుకెళ్తున్న వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఆమెను హుటాహుటిన ESI ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.