మహిళా కానిస్టేబుల్ పై చెప్పుతో దాడి.. వీడియో వైరల్

యూపీలోని సీతాపూర్ లో మహిళా కానిస్టేబుల్ పై ఇద్దరు యువతులు చెప్పులతో దాడి చేశారు. ఆదివారం స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తుండగా కానిస్టేబుల్ తో వారికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి కానిస్టేబుల్ పై దాడికి దిగారు. ఆమెను చెప్పుతో కొట్టారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని అడ్డుకోవడంతో గొడవ సద్దుమనిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్