TG: మొంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి ధాన్యం కొట్టుకుపోవడంతో, ఒక మహిళా రైతు డ్రైనేజీలోంచి వడ్లు ఏరుకుంటూ గుండెలవిసేలా రోదించింది. తమకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌ను వేడుకుంది. ఈ సంఘటన రైతుల దుస్థితిని కళ్లకు కట్టింది.