రైల్లో మహిళా ఐటీ ఉద్యోగినికి లైంగిక వేధింపులు

తమిళనాడు ఈరోడ్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ప్రైవేట్ ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి ఈరోడ్‌కు కుర్లా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో రిజర్వ్‌ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్‌కు గురైన మహిళ కేకలు వేయగా, తోటి ప్రయాణికులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. సేలం రైల్వే స్టేషన్‌లో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌ చిత్తూర్‌కు చెందిన 45 ఏళ్ల శంకర్‌గా గుర్తించారు.

సంబంధిత పోస్ట్