కదులుతున్న బస్సులో నుంచి దూకిన మహిళా ప్రయాణికురాలు

TG: నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని జున్ని గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని బోకర్ నుంచి కుటుంబంతో కలిసి ఆదిలాబాద్‌ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ టీజీఆర్టీసీ బస్సు నుంచి ఒక మహిళ ప్రయాణికురాలు కదులుతున్నప్పుడు దూకింది. బస్సులో రద్దీ కారణంగా కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం వల్లే ఆమె దూకినట్లు కండక్టర్ తెలిపారు. 108 వాహనంలో తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తోటి ప్రయాణికుల నుంచి వాంగ్మూలం సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕